ధర్మసాగర్(కాజీపేట), వెలుగు: గంజాయి అక్రమ రవాణా కేసులో ఓ వ్యక్తికి పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ హనుమకొండలోని ఎన్‌డీపీఎస్ స్పెషల్సెషన్స్ కోర్టు జడ్జి అపర్ణాదేవి తీర్పు చెప్పారు. 2016 సెప్టెంబర్ 24న కాజీపేట జీఆర్‌పీ ఎస్సై దయాకర్ తన సిబ్బందితో కలిసి రైల్వే ప్లాట్‌ఫామ్‌పై తనిఖీలు చేస్తుండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపల్లి మండలం చిన్నపల్లెకు చెందిన దొండేటి రామాంజనేయులు 28 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు.
అప్పటి సీఐ మధుసూదన్ కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం సీఐ స్వామి కోర్టులో చార్జిషీట్దాఖలు చేశారు. పీపీ రాజమల్లు రెడ్డి కోర్టులో వాదనలు వినిపించగా, కాజీపేట జీఆర్‌పీ సీఐ నరేశ్నేతృత్వంలో పోలీసులు సాక్షులను హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో రామాంజనేయులుకు జడ్జి మంగళవారం శిక్ష ఖరారు చేశారు.
